కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి, కన్నమంగళ గేట్ వద్ద ఒక ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ చోటుచేసుకుంది. ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 24మంది పురుషులు, ఏడుగురు మహిళలు వున్నారు. పక్కా సమాచారం ప్రకారం పోలీసులు రైడ్ చేసి 31మందిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 24 మంది పురుషులు, ఏడుగురు మహిళలు వున్నారు.
వీరంతా ఎక్కువ ఐటీ రంగంలో పనిచేసే వ్యక్తులని పోలీసులు గుర్తించారు. అనంతరం పట్టుబడిన వారి నుంచి కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
వీరి బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్స్‌కు పంపించారు. ఈ రేవ్ పార్టీని ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా ద్వారా ఆహ్వానాలు పంపి నిర్వహించారు. కాగా ఆ రేవ్ పార్టీలో అరెస్ట్ చేయబడిన వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే మాదకద్రవ్యాల సరఫరా ముఠాను గుర్తించడానికి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.