ఒక మహిళను మరో మహిళ ప్రోత్సహించినప్పుడే నిజమైన మహిళా సాధికారత అని సినీ నటి రాశిఖన్నా అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ నటి రాశిఖన్నా మాట్లాడుతూ.. మహిళల సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. తాను పోలీసుల్లో ఎక్కువగా మగవారే ఉంటారనే అభిప్రాయంలో ఉండేదన్నని.. నేటి సమాజంలో మహిళలు డెపార్ట్ మెంట్ లో ఉండడం సంతోషంగా ఉందన్నారు. తమ తల్లిదండ్రులు తన తమ్ముడిని తనను సమానంగా పెంచారని గుర్తు చేసుకున్నారు.
ప్రతీ ఒక్కరూ మగ పిల్లలను, ఆడ పిల్లలను సమానంగా చూడాలన్నారు. జ్ఞానం శక్తివంతమైనదన్నారు. మహిళలు జ్ఞాన సముపార్జనకు కష్టపడాలన్నారు. అనంతరం దీప్తి రావుల, సీఈఓ (వి-హబ్) మాట్లాడుతూ ముందుతరాల మహిళల కృషి కారణంగానే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. జీవితంలో నెట్ వర్క్ ను పెంచుకోవాలన్నారు. అనేక ఉద్యోగావకాశాలున్నాయి వాటిని గుర్తించాలి అన్నారు.
వృత్తిపరంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ఒక వ్యక్తిని విద్యావంతులను చేస్తే కేవలం ఆ వ్యక్తిని మాత్రమే విద్యావంతులను చేస్తారు. అయితే ఒక స్త్రీని విద్యావంతురాలిని చేస్తే, మొత్తం కుటుంబాన్ని, ఒక తరాన్ని విద్యావంతులను చేస్తారన్నారు. తల్లిదండ్రులు అబ్బాయిలను, అమ్మాయిలను సమానంగా చూడాలన్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. మాట్లాడుతూ ముందుగా వేధిక మీద ఉన్న అందరికీ అభినందనలు తెలిపారు. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది Each for Equal అనే స్లోగన్ తో విమెన్స్ డే జరుపుకుంటున్నామన్నారు.
ఇదే నినాదంతో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఏటా నిర్వహిస్తోందన్నారు. ఐటి కారిడార్ లో అత్యధిక సంఖ్యలో మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. వారందరికీ షీ టీమ్స్ రక్షణ కల్పిస్తుందన్నారు. మహిళా దినోత్సవం అంటే కేవలం ఈ ఒక్కరోజు కాదు సింబాలిక్ గా ఒక రోజు జరుపుకుంటాము కానీ ప్రతీ రోజు మహిళలదేనన్నారు. మహిళా సిబ్బంది వల్లనే సైబరాబాద్ పోలీసులకు మంచి పేరు వచ్చిందన్నారు.
మహిళల భద్రతా కోసం సైబరాబాద్ పోలీసులు అనేక కార్యక్రమాలు అపరేషన్ స్మైల్, భరోసా, బాలమిత్ర బాగా పని చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సిస్టమ్లు చక్కగా పని చేస్తున్నాయన్నారు. రెసెప్శంలలో మహిళా సిబ్బంది సమస్యలు అడిగి తగు సాయం చేస్తున్నారన్నారు. మహిళలు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. తాను తన జీవితంలో ఉన్న మహిళల కారణంగానే ఈరోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు.
విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ కు ప్రత్యామ్నామం లేదన్నారు. సక్సెస్ కు షార్ట్ కట్ లు లేవన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ సేవలను ప్రశంసించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిసిపి అనసూయను అభినందించారు.
అనంతరం ఎస్సీ ఎస్సీ విమెన్ ఫోరం జాయింట్ సెక్రెటరీ ప్రత్యుషా శర్మా మాట్లాడుతూ మహిళలు ఎప్పుడూ కూడా తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దన్నారు. నెవర్ గివప్ అన్నారు. ఆత్మవిశ్వాసం తో పని చేయాలన్నారు. మెంటర్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో భాగంగా షీ టీమ్స్ మహిళల భద్రతకు ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
అనంతరం ఏడీసీపీ క్రైమ్స్ -I కవిత మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి తమదైన ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. ఆ ప్రత్యేకత ను గుర్తించాలన్నారు. ఒకప్పుడు ఇంటి వరకే పరిమితమైన మహిళలు నేడు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు చేరాలన్నారు. అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు.
ఏడీసీపీ క్రైమ్స్ – II ఇందిర మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలకు ప్రతీకగా/ గుర్తుగా జరుపుకునే ప్రపంచ దినోత్సవమన్నారు. వృత్థిపరంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. జీవితంలో నేర్చుకోవడం ఒక నిరంతర ప్రక్రియ కావాలన్నారు.
అనంతరం షీ వీడియో ను సైబరాబాద్ సీపీ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విమెన్ ఫోరం జాయింట్ సెక్రెటరీ ప్రత్యుషా శర్మా, ఏడీసీపీ క్రైమ్స్ – I కవిత, ఏడీసీపీ క్రైమ్స్–II ఇందిర, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్జిపి,ప్రొబేషనరీ ఐపీఎస్ రితీ రాజ్, సీఏఓ (అకౌంట్స్) చంద్రకళ, సీఏఓ (అడ్మిన్) మహమూదా బేగం, షీ టీమ్స్ సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్, మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్సీ మార్గదర్శక్స్, ట్రాఫిక్ వాలంటీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.