యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావాలి కానీ... కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ లవ్ స్టోరీపై చాలా అంచనాలు ఉన్నాయి. సమ్మర్లో రిలీజ్ అంటూ ప్రకటించారు.
ఆ తర్వాత సమ్మర్ రేసు నుంచి తప్పుకుంది అని వార్తలు రావడంతో చిత్ర నిర్మాతలు అలర్ట్ అయి అలాంటిది ఏమీ లేదు. సమ్మర్లో లవ్ స్టోరీని రిలీజ్ చేయడం ఖాయం. రిలీజ్ డేట్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ తెలియచేసారు. అయినప్పటికీ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ పైన వార్తలు వస్తూనే ఉన్నాయి. మే 22 లేదా మే 29న లవ్ స్టోరీ రిలీజ్ కానుందని తెలిసింది. మరో వైపు లవ్ స్టోరీ జూన్ నెలలో రిలీజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. రిలీజ్ డేట్స్ పైన ఇలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఏ పిల్ల అంటూ సాగే సాంగ్ ఫుల్ వీడియోను మార్చి 11న 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేసారు.
ఇదిలా ఉంటే... ఈ లవ్ స్టోరీ కోసం చైతు డిఫరెంట్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసాడు. ఇంతకీ ఏం చేసాడంటే... సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో వెళ్లిపోమాకే అనే పాట తన ఫేవరేట్ లవ్ సాంగ్ అని చెప్పి మీ ఫేవరేట్ లవ్ సాంగ్ ఏంటో చెప్పండని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దీనికి సమంత స్పందిస్తూ... ఏమాయ చేసావే చిత్రంలోని ఈ హృదయం అనే సాంగ్ తన ఫేవరేట్ లవ్ సాంగ్ అని ట్విట్టర్ ద్వారా తెలియచేయడం విశేషం.