ఉరుములతో కూడిన వర్షాలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై వణికిపోయింది. ఇప్పటికే భారీ వర్షాల ధాటికి నీటిలో నానిపోతున్న జనం.. మరో కుండపోత వాన పొంచి ఉందన్న హెచ్చరికలతో అందోళన చెందారు. కానీ, వరణుడు కరుణించి చిరు జల్లులతోనే సరిపెట్టడంతో ముంబై ఊపిరిపీల్చుకుంది.
ఉత్తరాదిన కురుస్తోన్న వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం అంతకంతకూ పెరిగిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో భారీగా వరద నీరు చేరడంతో.. తీరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సగం వరకు నీటమునిగాయి.