ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రజారంజక పాలన సాగిస్తూ ప్రతి ఒక్కరి మన్నలతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పెట్రోల్‌పై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 మేరకు తగ్గనుంది.
మరోవైరు దేశ వ్యాప్తంగా గత 27 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు.. నవంబరు 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10, రూ.5 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభించింది.