సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఊరట: పిటిషన్ తిరస్కరణ

మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (12:40 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూవ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తద్వారా రాబర్ట్‌కు కాస్త ఊరట లభించింది. 
 
హర్యానాలోని వాద్రా సంస్థలకు వ్యవసాయ భూమిని అమ్మడం, ఆ వ్యవసాయ భూమిని ప్లాట్లుగానూ, కాలనీలుగానూ మార్చేందుకు బిల్డర్లు, డెవలపర్లకు లైసెన్సులు మంజూరు చేయడంపై కూడా పూర్తి దర్యాప్తు జరగాలని పిటిషనర్ కోరాడు. 
 
ఈ క్రమంలో రూ.20,000 కోట్ల కుంభకోణం జరిగిందని... మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం ఆరోపణల కింద సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అయితే, ఈ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేయడంతో వాద్రాకు ఈ విషయంలో ఉపశమనం కలిగింది.

వెబ్దునియా పై చదవండి