పచౌరీ నేతృత్వంలోని ఐపీసీసీ నోబెల్ బహుమతి అందుకుంది. మానవ నిర్మిత వాతావరణ మార్పునకు సంబంధించిన అవగాహన పెంపొందించడానికి, వ్యాప్తి చేయడానికి, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలకు విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు లభించింది.
అలాగే, న్యూఢిల్లీలోని ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తేరి) వ్యవస్థాపక అధ్యక్షుడైన పచౌరీ ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ తర్వాత తేరి డైరెక్టర్ పదవీ బాధ్యతల నుంచి పచౌరీ తప్పుకున్నారు.