మూడో దశను ఎదుర్కొవడానికి రూ.23,123 కోట్ల నిధులు: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌

శనివారం, 21 ఆగస్టు 2021 (07:38 IST)
కోవిడ్‌ - 19 మూడో దశను ఎదుర్కొవడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.23,123 కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు.

ఈ దశ ఇతరులకన్నా చిన్నారులపై అధికంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో శిశు వైద్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

తన సొంత హిమాచల్‌ ప్రదేశ్‌ లో జన ఆశ్వీర్వాద్‌ యాత్రలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు