అది పవిత్రమైన మంగళసూత్రం యాడా?లోదుస్తుల యాడా? అని ఏకిపారేశారు. సబ్యసాచి డిజైన్ చేసిన మంగళసూత్రం ఎంత వివాదమైందంటే..సాక్షాత్తు హోంమత్రి మంత్రిగారే రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చేంత రచ్చ అయిపోయింది. దీంతో అనుకున్నది ఒక్కటి..అయినది ఒక్కటి అన్నట్లుగా పాపం డిజైనర్ సబ్యసాచి మంగళసూత్రం యాడ్ ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఇంటిమేట్‌ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఓ 'మంగళసూత్రం' డిజైన్ చేశారు. మంగళసూత్రం డిజైన్ బాగుందనే ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ వచ్చిన చిక్కల్లా దాన్ని పబ్లిసిటీ చేయటానికి..చేసిన యాడ్ వల్లే వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌పై తీవ్ర ఆగ్రహాలు వెల్లువెత్తాయి. పవిత్ర మంగళ సూత్రం కోసం ఇలాంటి ఫొటోషూట్ చేస్తావా' అంటు పలువురు ప్రముఖులు సబ్యసాచిపై దుమ్మెత్తి పోశారు.
ఈ మంగళసూత్రం యాడ్ లో మంగళసూత్రాన్ని ధరించిన ఓ మహిళ అసభ్యకర రీతిలో ఉంది.అంటే శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉంది. మరో ఫోటోలో స్వలింగ సంపర్కులు కూడా ధరించినట్టుగాను..అలాగే ఒంటరిగా ఉన్న మహిళలు కొందరు మంగళసూత్రంతో కనిపించింది. ఈ ప్రకటన వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్ చేశారు. మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ సవ్యసాచిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
దీంతో ఈ విషయం కాస్తా మధ్యప్రదేశ్ మంత్రి హోం మంత్రి కూడా స్పందించారు. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. దీంట్లో భాగంగా మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా..24 గంటల్లోపు యాడ్‌ను ఉపసంహరించుకోవాలని అల్టిమేటమ్ జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..పోలీసులు బలగాలను కూడా పంపిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు మంత్రి అల్టిమేటంతో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.