ఇదే అశంపై శశికళ చెన్నైలో మాట్లాడుతూ... పార్టీ నుంచి తనను బహిష్కరించలేదని గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే ఎంపీగా కొనసాగుతున్నానని తెలిపింది. జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌కు వ్యతిరేకంగా శశికళ పుష్ప తీవ్ర ఆరోపణలు చేశారు. జయలలితను చంపేందుకు శశికళ నటరాజన్ ప్రయత్నించారని, దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
కాగా, పార్టీ పగ్గాలు చేపట్టాలని అంతా శశికళను కోరుతున్నారన్న వార్తల నడుమ, తాను కూడా పోటీలో ఉన్నానని శశికళ పుష్ప ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇది శుక్రవారం వెలువడే మద్రాస్ హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. 75 శాతం మంది కార్యకర్తలు పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించేందుకు సముఖత వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.