ఈ కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు భాస్కరన్‌తో పాటు ఆయన భార్యకు ఐదేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై మద్రాసు హైకోర్టులో ఆయన అప్పీల్ చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు, సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే ఖరారు చేసింది. అయితే, భాస్కరన్ భార్యకు మాత్రం మూడేళ్ళ జైలుశిక్ష విధించింది.
కాగా, ఇటీవల ఐటీ సోదాలతో ఉక్కిరిబిక్కిరి అయిన శశికళ కుటుంబ సభ్యులు తాజా తీర్పుతో మరింత షాక్‌కు గురయ్యారు. కాగా, శశికళ, దినకరన్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్ళపై ఐటీ శాఖ అధికారులు ఏకధాటిగా ఐదు రోజుల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ సోదాల్లో అధికారికంగా రూ.1430 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం.