ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన బిజెపి నేత ఆశీర్వాదం ఆచారి స్వయంగా తెలిపారు. శశికళ ముందుగానే విడుదల కావడానికి బిజెపి నేతల ఆశీస్సులు కూడా కారణమన్న ప్రచారం ఊపందుకుంది. తమిళనాడులో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శశికళతో బిజెపి అగ్రనేతలు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. బిజెపి ప్రతిపాదనలకు శశికళ కూడా సై అన్నారట. దీంతో శశికళ మార్గం సుగుమమైందట.
సరిగ్గా ఎన్నికల సమయంలో బిజెపిలో చేరి ఎన్నికల్లోకి వెళదామని నిర్ణయించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇది పెద్ద షాకే. రజినీకాంత్‌ను కాదని శశికళతో బిజెపి నాయకులు సంప్రదింపులు జరపడం.. అది కాస్త విజయవంతం కావడంతో అన్నాడిఎంకేలోని ఒక వర్గంలో సంతోషం వ్యక్తమవుతోందట. మరి ఆగష్టు 14వ తేదీన చిన్నమ్మ శశికళ విడుదల అయితే రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరగబోతోందో అన్నది ఆసక్తికరంగా మారుతోంది.