తన భర్తను హత్య చేసిన తర్వాత కూడా ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి వివిధ పర్యాటక ప్రాంతాల్లో విహరించింది. భర్త విదేశాల్లో ఉన్నపుడు కూడా ప్రియుడుతో ఎంజాయ్ చేసింది. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు భార్యతో ఏకాంతంగా గడిపాడు. ఈ పరిస్థితుల్లో ముస్కాన్ గర్భానికి కారణం ఎవరు అన్నదానిపైనే ఇపుడు చర్చ సాగుతోంది.
అందుకే ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని సౌరభ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ఆ బిడ్డకు సౌరభే తండ్రి అని తేలితే ఆ పసికందును తామే పెంచుతామని, ఒకవేళ సాహిల్ బిడ్డ అని తేలితే తమకు ఎలాంటి సంబంధం లేదని సౌరభ్ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.