ప్రతికూల వాతావరణంలోనూ క్షిపణి.. లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు డీఆర్డీఓ ప్రకటించింది. గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ గురి తప్పకుండా ఛేదించిందని డీఆర్డీఓ తెలిపింది. కాగా, రెండు రోజుల వ్యవధిలో ఆకాశ్‌కు ఇది రెండో పరీక్ష.
ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఇవాళ్టి టెస్ట్‌లో.. లాంచర్, రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్డీఓ తెలిపింది.