భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన కొవిడ్-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.