వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావేద్, ఫసీనా దంపతులు బెంగళూరులో నివసిస్తున్నారు.
తాగిన నీటిలో యాసిడ్ కలపడంతో ఆమె రక్తపు వాంతులు చేసిందని వైద్యులు నిర్ధారించారు. యాసిడ్ తాగడంతో ఆమె అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.