అయితే, బీజేపీకి శివసేన మద్దతు ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్‌ను మినహాయిస్తే మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో 53 మంది ఎమ్మెల్యేలు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెంట ఉన్నట్టు తేలిపోయింది.
అజిత్ పవార్‌తో ఏ ఒక్కరూ లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గురుగ్రాంలో బీజేపీ నిర్భంధంలో ఉన్న నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబైకి చేరుకున్నారని.. వారు తమతోనే ఉన్నారని ఎన్సీపీ చెప్పింది. అనిల్ పాటిల్, బాబాసాహెబ్ పాటిల్, దౌలత్ ధరోడా, నరహరి జిర్వార్‌లను బీజేపీ గురుగ్రాంలో ఇన్నాళ్లూ నిర్భంధించిందని ఎన్సీపీ ఆరోపించింది.
కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన మరో ఎన్సీపీ ఎమ్మెల్యే అన్నా బన్సోడే కూడా పుణెలో ఉన్నట్లు తెలిసిందని.. త్వరలో తమ వద్దకు వస్తారని ఎన్సీపీ తెలిపింది. ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని.. తమకు 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సదరు పార్టీలు దీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. బల పరీక్షపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.