శేఖర్ రెడ్డా... మజాకా.. రూ.2000 నోట్లు ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఇంటికి...

గురువారం, 15 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల ముందు డబ్బు కోసం పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. ఐతే బడా బాబులు మాత్రం రూ. 2000 నోట్ల కరెన్సీ నోట్లను భారీగా ఇంటికి తెచ్చుకున్నారు. ఈ నోట్లు ఎలా వచ్చాయోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవలే తితిదే బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో తనిఖీ చేసినప్పుడు రూ. 34 కోట్ల రూ.2000 నోట్ల కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఈ నోట్లు శేఖర్ రెడ్డి ఇంటికి ఎలా వచ్చాయా అని చాలామందికి అంతుపట్టలేదు. 
 
ఆయన ఇంట్లో దొరికిన రూ.2 వేల నోట్ల సీరియల్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తే షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆయన ఇంటికొచ్చిన కొత్త రూ.2వేల నోట్ల కట్టలన్నీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా ఆయన ఇంటికి వచ్చేసినట్లు తేలింది. అసలు ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రణ అనంతరం ఈ నోట్లు రిజర్వు బ్యాంకుకు, ఆ తర్వాత బ్యాంకులకు, ఆ తర్వాత ప్రజలు వెళ్లాల్సి ఉంది. 
 
ఐతే ఇన్ని స్టాపులు లేకుండా నేరుగా ముద్రణ ముగించుకుని రూ.2000 నోట్ల కట్టలు శేఖర్ రెడ్డి ఇంటికి వచ్చాశాయంటే ఆయన పవర్ ఎంతటిదో అర్థమవుతుంది. కాగా ఇదంతా స్టేట్ బ్యాంకుకు చెందిన అధికారుల ద్వారా జరిగిందని తెలిసింది. త్వరలో వీరిని అదుపులోకి తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి