రాహుల్ గాంధీ రోడ్‌షో... వాహనంపైకి బూటు విసిరిన స్థానికుడు

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టి... ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సోమవారం సీతాపూర్‌లో రోడ్ షో చేస్తుండగా ఒక స్థానిక యువకుడు రాహుల్ ప్రచార రథంపైకి బూటు విసిరాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బూటు అతనిపై కాకుండా ఆయన వెనుక భాగంలో నిల్చునివున్న అనుచరుడిపై పడింది. 
 
ఈ విషయం గ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు బూటు విసిరిన కార్యకర్తపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు, రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి