పంజాబ్ గాయకుడు సిద్ధూను హత్య చేసిన నిందితుడు అరెస్టు

గురువారం, 9 జూన్ 2022 (14:58 IST)
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో సిద్ధూ మూసేవాలా అనే ప్రసిద్ధ గాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు ప్రధాన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచి హత్యకు ప్లాన్ వేసి పక్కాగా అమలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే, సిద్దూను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. 
 
సిద్ధూ కల్పిస్తూ వచ్చిన భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది. ఆ రోజునే ఆయన హత్యకు గురయ్యారు. కేవలం గ్యాంగ్ వార్‌లో భాగంగానే సిద్ధూను హత్య చేసినట్టు పోలీసుల తొలుత భావించారు. 
 
ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఈ హత్య తమ ముఠా పనేనని వెల్లడించారు. అయితే, లారెన్స్‌ను హత్య చేసిన ప్రధాన షూటర్ మాత్రం ఇంకా కనిపించలేదు. పైగా, ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు