సిమీ కార్యకర్తలు హతమైన వేళ నిరాయుధులే.. అయితే ఏంటి..? షమీ తీవ్ర వ్యాఖ్యలు

బుధవారం, 2 నవంబరు 2016 (16:31 IST)
భోపాల్ సెంట్రల్  జైలు నుంచి తప్పించుకుని.. ఆపై ఎనిమిది మంది పోలీసుల ఎన్‌కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వీరి ఎన్‌కౌంటర్‌ ఘటనపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను ఎన్‌హెచ్చార్సీ ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో సిమీ కార్యకర్తల ఎన్‌‍కౌంటర్ ఉదంతంపై మధ్యప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ తీవ్ర వాఖ్యలు చేశారు. సిమీ కార్యకర్తల వద్ద ఆయుధాలు లేవని విషయంలో తన వాదనకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పరారైన సిమీ కార్యకర్తలు హతమైన వేళ వారి నిరాయుధులేనని వారిని పోలీసులే కాల్చి చంపారన్నారు. పోలీసులు ఎప్పుడు ఆయుధాలను ఉపయోగించి ప్రాణాలు తీసుకోవాలో చట్టంలో ఉందని గుర్తు చేశారు. కరుడుగట్టిన నేరస్తులు పరారైనప్పుడు పోలీసులు తమ శక్తిని ఉపయోగించాల్సి వుంటుందని ఏటీఎస్‌ చీఫ్‌ సంజీవ్‌ షమీ వెల్లడించారు. 
 
కానీ పరారైన సిమీ కార్యకర్తలు మొదట కాల్పులు జరపడంతోనే తాము ఎదురుకాల్పుల్లో జరిపామని, ఈ ఎదురుకాల్పుల్లోనే వారు హతమయ్యారని పోలీసులు చెప్తుండగా.. వారి వాదనను విభేదిస్తూ షమీ వ్యాఖ్యలు చేశారు. రెండురోజుల కిందట సిమీ కార్యకర్తలు పోలీసుల చేతిలో చనిపోయిన విషయాన్ని మొదట ప్రకటించింది తానేనని, కాబట్టి ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసునని షమీ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి