గుజరాత్‌లో ఘోరం - గ్యాస్ లీకై ఆరుగురు మృత్యువాత

గురువారం, 6 జనవరి 2022 (09:42 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషపూరిత వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని సూరత్ పట్టణ సమీపంలో ఉన్న సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
స్థానికంగా ఉండే రసాయన కర్మాగారం నుంచి ఉన్నట్టుండి గ్యాస్ లీక్ కావడంతో అందులో పని చేసే కార్మికుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సూరత్‌ సివిల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు