ఏటీఎం యంత్రంలో బుసలు కొడుతున్న పాము... ఎక్కడ?

బుధవారం, 13 మే 2020 (16:21 IST)
లాక్డౌన్ పుణ్యమాన్ని వన్యప్రాణులతో పాటు క్రూరమృగాలు, జంతువులు, పక్షులు, పాములు ఇలా ప్రతి ఒక్క జీవరాశికి ఎక్కడలేని స్వేచ్ఛ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా మనిషి ఇంటికే పరిమితమయ్యాడు. ఇదే ఇతర జీవజాతులకు ఓ సువర్ణావకాశంలా మారింది. ఫలితంగా జనవాస ప్రాంతాలకు వస్తున్నాయి. రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. తాజాగా ఒక పాము ఏటీఎం యంత్రం నుంచి బుసలు కొడుతూ బయటకు రాలేక అందులోనే ఉండిపోయింది. దాన్ని చూసిన ఓ ఏటీఎం వినియోగదారుడు ప్రాణభయంతో పరుగు తీశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌లోని ఓ ఏటీఎం కేంద్రానికి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఆ మిషన్‌లో ఉన్న ఆ పాము.. వ్యక్తిని చూడగానే బుసలు కొట్టసాగింది. దీంతో ఆ వ్యక్తి భయపడి బయటకు దౌడు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తమకు తోచిన విధంగా జోక్స్ పేలుస్తున్నారు. 
 
లాక్డౌన్ వేళ పాము డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తోంది అంటూ కొందరు జోక్ చేయడం వీడియోలో వినిపిస్తోంది. చివరికి ఏటీఎం మెషీన్ పైభాగంలో ఓ కన్నం కనిపించడంతో ఈ భారీ పాము అందులోకి దూరిపోయింది. వీడియో మొదట్లో పెద్దగా ఆశ్చర్యంగా ఏమీ లేకపోయినా.. చివరికి పాము తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు