శివపురికి చెందిన ఓ వ్యక్తి (34) పట్ల వీధిలోని వారంతా వివక్ష కనబర్చుతున్నారు. అతడి ఇంటి వద్దకు పాలు, కూరగాయలు అమ్మే వ్యక్తులు కూడా రావట్లేదు. కుటుంబాన్ని వీధిలో ఉన్న వారంతా దూషిస్తున్నారని అతడు చెప్పాడు.
'మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేసి, నెగిటివ్ అని తేల్చారు. కానీ, స్థానికులు మా ఇంట్లోని వారిని దూషిస్తున్నారు. దీంతో పోలీసులకు ఈ విషయం చెప్పాను. అయినప్పటికీ స్థానికుల తీరు మారలేదు. దీంతో నేను మా ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాను' అని చెప్పాడు.
అయితే, క్వారంటైన్‌లో వారు ఉన్న సమయంలో రోడ్లపై తిరిగారని, దీంతో స్థానికులు వారితో గొడవ పెట్టుకున్నట్లు కూడా తెలిసిందని పోలీసులు చెప్పారు. మధ్య ప్రదేశ్‌లో 604 మందికి కరోనా సోకింది. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.