ద్వారకలో మొదలై డిబ్రూఘర్‌లో పరిసమాప్తమైన సూర్యగ్రహణం

ఆదివారం, 21 జూన్ 2020 (17:26 IST)
దేశ వ్యాప్తంగా అమితాసక్తిని కలిగించిన రాహుగ్రస్త సూర్యగ్రహణం ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సూర్యగ్రహణం తొలుత గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో కనిపించింది. చివరగా అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.04 గంటలకు పరిసమాప్తమైంది. 
 
అంతకుముందు ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తిస్థాయిలో కనువిందు చేసింది. సూర్యుడి మధ్య భాగాన్ని జాబిల్లి పూర్తిగా కప్పేశాడు. ఫలితంగా సూర్యుడు ఓ వలయ రూపంలో (రింగ్ ఆఫ్ ఫైర్)గా కనిపించాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న సమయాల్లో సూర్యగ్రహణం కనిపించింది. 
 
ఇక, గ్రహణ ఘడియలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో సంప్రోక్షణలు మొదలయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తి ఆలయం తప్ప దేశంలోని అన్ని ఆలయాలను మూసివేసిన విషయం తెల్సిందే. సూర్యగ్రహణం ముగిసిన నేపథ్యం ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ ప్రక్రియ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు