కనువిందు చేసిన రాహుగ్రస్త్య సూర్యగ్రహణం - 12 గంటలకు రింగ్ ఫైర్

ఆదివారం, 21 జూన్ 2020 (13:00 IST)
ఆకాశంలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుగ్రస్త్య సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు బహు సుందరంగా కనిపించాడు. ఆదివారం ఉదయం 9.16 గంటల నుంచి ప్రారంభమైన సూర్య గ్రహణం మధ్యాహ్నం 3.04 గంటల వరకు కొనసాగనుంది. 
 
కాగా, ఉదయం 10.14 గంటలకు ఆకాశంలో సుందరదృశ్యం కనపడి అందరినీ ఆకర్షితులను చేసింది. పూర్తిస్థాయిలో వలయాకార సూర్య గ్రహణం ఏర్పడడం గమనార్హం. సూర్యుడి కేంద్ర భాగం కనపడకుండా అడ్డుగా జాబిల్లి వచ్చింది.
 
తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం సూర్యుడు కనిపిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 1.49 వరకు 46 శాతం కనిపిస్తాడు. 
 
ఈ సూర్యగ్రహణంలో భాగంగా సరిగ్గా 12 గంటలకు రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలిచే సంపూర్ణ సూర్యగ్రహణం ఆదివారం కనిపించింది. రింగ్ ఫైర్ అని పలిచే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా ప్రజలకు కనువిందు చేసింది. 
 
చంద్రుడు.. సూర్యుడిని కమ్మేయడంతో ఏర్పడేదే సూర్యగ్రహణం. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే కక్ష్యలోకి వచ్చినప్పుడు సంభవించే ఈ గ్రహణం భారత్‌లో ఆదివారం ఉదయం 1.19 గంటలకు ప్రారంభమై.. 12 గంటలకు రింగ్ ఫైర్ దర్శనమిచ్చింది.
 
మధ్యాహ్నం 1.45 గంటలకు గ్రహణం పూర్తిగా వీడుతుంది. దాదాపు మూడున్నర గంటలసేపు ఇది ఉంటుంది. భారత దేశంలో గుజరాత్‌లోని ద్వారకాలో ఈ గ్రహణం మొదట కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని అధికారులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు