ఐఎన్ఎక్స్ కేసులో చిక్కిన చిదంబరం.. తీహార్ జైలుకు సోనియా - మన్మోహన్

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:04 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చిక్కారు. ప్రస్తుతం ఈయన తీహార్ జైలులో ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు జైలుకెళ్లారు. 
 
సోమవారం ఉదయం తీహార్ జైలుకు వచ్చిన వీరు, లోనికి వెళ్లి చిదంబరంతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారని తెలుస్తోంది. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సోనియా, పార్టీ అండగా నిలుస్తుందని, కష్టకాలం త్వరలోనే ముగుస్తుందని ధైర్యం చెప్పినట్టు సమాచారం. సోనియా, మన్మోహన్ సింగ్‌ల రాకతో తీహార్ జైలు వద్ద సందడి నెలకొనగా, పోలీసులు అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
కాగా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు చిదంబరం జ్యూడీషియల్ కస్టడీ విధించింది. అదేసమయంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఫలితంగా చిదంబరంను సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించి, ప్రత్యేక గదిలో ఉంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు