నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:12 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఇదివరకే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో విలీనమైందని తెలిపారు. అక్టోబర్‌ 1 నాటికి రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీ పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోని పలు ప్రదేశాలు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయని వెల్లడించారు.

అందుకు అనువైన మార్పులు వాతావరణంలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు