తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అత్తియపాలెంకు చెందిన 54 యేళ్ల వ్యక్తి స్థానికంగా ఉండే ఓ క్యాంటీన్‌లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఈ వ్యక్తి పక్కింటి బాలుడిపై కన్నేశాడు. ఆ బాలుడి తండ్రి విధులకు, తల్లి బయటకు వెళ్లి సమయం చూసి బాలుడిని బిల్డింగ్‌పైకి తీసుకెళ్లాడు.
అక్కడే అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి క్యాంటీన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే, తన తల్లి తిరిగి వచ్చిన తర్వాత బాలుడు జరిగిన విషయం ఆమెకు చెప్పాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.