ఎన్ఐఏ తరపున సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టులో వాదనలు వినిపించారు. తహవూర్ రాణా తరపున, ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాది పియూష్ సచ్‌దేవా తన వాదనను వినిపించారు.
రాణాను 20 రోజుల కస్టడీ విచారణకు ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత, ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చంద్రజీత్ సింగ్ ఏజెన్సీకి 18 రోజుల కస్టడీని మంజూరు చేశారు. ప్రధానంగా 2008 ముంబై దాడుల వెనుక ఇతను కుట్ర కోణం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఈ ముంబై ఉగ్రదాడిలో దాదాపు 166 మంది చనిపోగా 238 మందికి పైగా గాయపడ్డారు.