ఈ వీడియోకు సోషల్ మీడియాలో 5 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల నుండి ప్రశంసలను పొందింది. చాలామంది విద్యార్థుల నైపుణ్యాలను ప్రశంసించారు. ఈ వీడియో నృత్యం, సంగీతం తమిళ భాషకు దగ్గరగా వున్నందున తమిళనాట ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
"అనన్ త పద్ చాయే" అనే పాట తమిళంలో ధ్వనించే సాహిత్యం కారణంగా భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. అయితే అసలు సంగీతాన్ని థాయ్ హాస్యనటుడు-గాయకుడు నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. ఈ సాహిత్యం వాస్తవానికి సాంప్రదాయ థాయ్ మంత్రంలో భాగం, 2019లో ఇండోనేషియా సంగీత విద్వాంసుడు నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో వాటిని స్వీకరించిన తర్వాత ఇది ప్రజాదరణ పొందింది.