వందల సంవత్సరాలుగా నలుగుతున్న అయోధ్య సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాను మధ్యవర్తిత్వం నెరపుతానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన తన పనిని ప్రారంభించారు. ఇందులోభాగంగా, ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరూ అర్థగంటపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు.
అంతేకాకుండా, వివాదాస్పద అయోధ్య బాబ్రీ మసీదు - రామమందిర స్థలాన్ని గురువారం సందర్శించారు. ఈ వివాదంతో సంబంధమున్నవారితో చర్చలు జరుపనున్నారు. ఇక్బాల్ అన్సారీ, హాజీ మెహబూబ్‌తో చర్చించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామమందిరానికి ఒక పరిష్కారం కనుగొంటామని, వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మిస్తామని చెపుతున్నారు. ఇందుకోసం అన్ని పార్టీలనూ ఒప్పిస్తామని చెప్పారు. చర్చలు ఫలప్రదమవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.