గాలి కూతురి పెళ్లి.. కత్రినా, షారూఖ్, ప్రభుదేవా డ్యాన్స్.. మోడీ, బాబు, వెంకయ్యలకు పిలుపు..
అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు అయిన గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అట్టహాసంగా జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు వీడియోలో ఆహ్వానించిన తీరే ఆకట్టుకునే విధంగా ఉండగా.. ఇక పెళ్లి తంతు వైభవంగా జరుగనుందని టాక్. వెడ్డింగ్ కార్డ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన గాలి, కూతురి పెళ్లి వేడుకను మరింత అట్టహాసంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గాలి కూతురి పెళ్లిలో బాలీవుడ్ సెలబ్రెటీలు ఆడిపాడనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సెలెబ్రిటీలు షారూక్ ఖాన్, ప్రభుదేవా, కత్రినా కైఫ్, తమన్నాతో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాలపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నవంబర్ 16వ తేదీన జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో గాలి హీరో ఉపేంద్రను ఇంటికెళ్లి మరీ గాలి జనార్ధనరెడ్డి ఆహ్వానించడం విశేషం. అంతేకాదు దేశానికి చెందిన పలువురు రాజకీయ నేతలను గాలి స్వయంగా ఆహ్వానిస్తారట. ఆ జాబితాలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గాలి వినూత్నంగా తయారుచేయించిన వెడ్డింగ్ కార్డ్స్‌పై చేసిన మొత్తం ఖర్చు రూ.5 కోట్లు అయ్యాయట.
బెంగళూరులోని ఓ పెద్ద ప్యాలెస్‌లో గాలి కూతురి పెళ్లి వేడుక నవంబర్ 16న ఘనంగా జరగబోతోంది. హైద్రాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్ దేవరరెడ్డి కుమారుడు రాజీవ్‌రెడ్డితో, గాలి కూతురు బ్రహ్మణి వివాహం జరగబోతోంది.