పార్లమెంట్ చేసిన చట్టాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిందేనని, ఈ మాట సుప్రీంకోర్టు చెబితే పాటించక తప్పదని ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ఆయన కోళికోడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, పార్లమెంటు చేసిన చట్టాలను తాము అనుసరించలేమని చెప్పడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కష్టమేనన్నారు.
సీఏఏ, ఎన్నార్సీలు తమకు ఆమోదయోగ్యం కావని పలు రాష్ట్రాలు చెబుతున్నాయని అన్నారు. కానీ, ఎన్నార్సీ అనేది ఎన్పీఆర్ (జాతీయ పౌర జాబితా) మీద ఆధారపడి ఉంటుందని... దీన్ని రాష్ట్ర స్థాయి అధికారులు నియమించిన స్థానిక రిజిస్ట్రార్ చేస్తారని తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.