దేశంలో అండర్ వాటర్ మెట్రో మార్గం నిర్మితంకానుంది. ఈ తరహా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మార్గం కోల్‌కతా నగరంలో అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది అడుగు భాగంలో రానుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ కారిడాల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హౌరా వయా కోల్‌కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కిలోమీ ఉండే ఈ మార్గం ఈ యేడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది.
హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ మార్గాన్ని నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో రైలు పట్టాలెక్కాల్సివుంది. చిన్న చిన్న సమస్యల వల్ల సమీపంలోని పలు గృహాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తిగా, అన్ని అనుకున్నట్టుగా సాఫీగా జరిగితే ఈ యేడాది జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది.