హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌వోడీ) చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని 31 ఏళ్ల మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ నెల 16వ తేదీన ఇతర విద్యార్థుల ముందు తనతో హెచ్‌వోడీ అసభ్యంగా ప్రవర్తించాడని, తన శరీర భాగాలను తాకాడని సదరు యువతి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం యూనివర్సిటీలోని బాత్రూమ్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో సురక్షితంగా బయటపడింది. కాగా, ఆమెకు మద్దతుగా నలుగురు యువకులైన విద్యార్థులు యూనివర్సిటీ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు.