కనీసం కాపీ కొట్టడం కూడా దద్దమ్మలు... తెలివి తక్కువ జోకర్స్ - పాక్‌ పరువుతీసిన అసదుద్దీన్

ఠాగూర్

మంగళవారం, 27 మే 2025 (15:55 IST)
పాకిస్థాన్‌ వైఖరిని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎండగట్టారు. కనీసం కాపీ కొట్టడం కూడా రాని దద్దమ్మలంటూ ఎద్దేవా చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన సైనిక చర్యకు సంబంధించి తప్పుడు జ్ఞాపికను ప్రదర్శించడంపై మండిపడ్డారు. వారిని తెలిపి తక్కువ జోకర్లు అంటూ ఘాటుగా విమర్శించారు. 
 
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రతికగా తాము ఆపరేషన్ బ్యూనాన్ ఉన్ మర్సూస్ నిర్వహించామని, అందులో విజయం సాధించామని చాటుకునేందుకు పాకిస్థాన్ ఆపసోపాలు పడుతుంది. ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానికి ఆర్మీ చీఫ్ ఓ జ్ఞాపికను బహుకరించారు. అందులో ఉన్న పెయింటింగ్ సైనిక విన్యాసాలకు సంబంధించిందని ఆరోపణలు వచ్చాయి. 
 
ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుటిల నీతిని ఎండగట్టేందుకు భారత ఎంపీల బృందాలు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, కువైట్‌లో పర్యటిస్తున్న ఎంపీల బృందానికి అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహించారు. ఇందులో పాకిస్థాన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టుడిప్ జోకర్స్ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు