కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్‌కు విముక్తి లభించింది. భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై ఉన్న అన్ని రకాల ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్టయింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ తీర్పును వెలువరించారు.
కాగా, సునందా పుష్కర్ 2014, జనవరి ఏడో తేదిన అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెల్సిందే. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. సెక్షన్ 302 మర్డర్ కేసు కూడా ఎంపీఐ పెట్టారు.
సునందను మానసికంగా కానీ శారీరకంగా కానీ తన క్లయింట్ వేధించలేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్, మెడికల్ నివేదికల ప్రకారం సునంది హత్య లేక సూసైడ్ కూడా కాదని చెబుతున్నట్లు కోర్టులో వాదించారు.