ఇక నుంచి యూట్యూబ్‌లో విచారణల ప్రత్యక్ష ప్రసారం

బుధవారం, 21 సెప్టెంబరు 2022 (16:26 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను యూ ట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుంది. కీలకమైన కేసులను విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈ ధర్మాసనం చేపట్టే కేసులన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణ రోజున చేపట్టిన కేసుల విచారణను సుప్రీంకోర్టు లైవ్‌లో పెట్టిన విషయం తెల్సిందే. అదేవిధంగా ఇకపై ఈ నెల 27వ తేదీ నుంచి సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే ప్రతి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వాస్తవానికి సుప్రీంకోర్టు కేసుల విచాణనను లైవ్‌ చేయాలంటూ గత 2018లో ఇచ్చిన తీర్పు ఇంతకాలానికి అమలుకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు