దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టిపారేసిన సుప్రీంకోర్టు... శశికళను దోషిగా నిర్ధారించింది. ఆమెతో పాటు దివంగత జయలలిత, ఇళవరసి, సుధాకరణ్‌లను దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. వీరందరికీ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు పదేళ్ల పాటు శశికళ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.