వంతారాకు సుప్రీం క్లీన్ చిట్

ఐవీఆర్

సోమవారం, 15 సెప్టెంబరు 2025 (20:16 IST)
గుజరాత్‌ జామ్‌నగర్‌లోని జూవాలజికల్ రిస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్ వంతారాపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎలాంటి లోపాలు లేవని స్పష్టంచేసింది. జస్టిస్‌ పంకజ్ మిట్టల్, జస్టిస్‌ పీ.బి. వరాలే సుప్రీంకోర్టు ధర్మాసనం SIT నివేదికను రికార్డులోకి తీసుకుని, వంతారా అనుసరిస్తున్న నిబంధనలు, నియంత్రణ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంది.
 
ఆగస్టు 25న సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో జస్టిస్ జస్తి చెలమేశ్వర్, జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ IRS అధికారి అనీష్ గుప్తా సభ్యులుగా ఉన్న కమిటీని ఏర్పాటు చేసింది. మీడియా రిపోర్టులు, NGOలు, వైల్డ్‌లైఫ్ సంస్థల ఫిర్యాదుల ఆధారంగా వచ్చిన ఆరోపణలపై ఈ బృందం విచారణ జరిపింది.
 
సెప్టెంబర్ 12న సమర్పించిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు, ఇది స్వతంత్ర కమిటీ సమీక్షించిన నివేదిక. నిపుణుల సహకారంతో సమగ్రంగా పరిశీలించారు. అందువల్ల ఈ నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాము. ఇకపై ఎవరూ అనవసర అభ్యంతరాలు వ్యక్తం చేయవద్దు అని వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు