అయినప్పటికీ ఇంకా పలు చోట్ల పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సెక్షన్ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో అభ్యర్థించింది.
ఈ సెక్షన్ ప్రకారం నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇపుడు కూడా అదే కేసులు దేశవ్యాప్తంగా నమోదు చేస్తుండటంపై సుప్రీం సీరియస్ అయింది.