దీనిపై తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది ధర్మాసనం. తాము రూపొందించిన అంశాలు, విచారణకు పట్టే కాలవ్యవధిపై సంబంధిత వ్యక్తులకు అదే రోజు వివరిస్తామని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారం చేపడతామని స్పష్టం చేసింది.
శబరిమల ఆలయం, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూది బోరో ముస్లిం వర్గంలో మహిళలకు సున్తీ చేయించడం, ఇతర మతస్థులను వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులను హరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 64 పిటిషన్లు దాఖలయ్యాయి.