సంతానం కలుగలేదని.. కోలీవుడ్ నటుడి భార్య ఉరేసుకుంది..

బుధవారం, 5 సెప్టెంబరు 2018 (11:36 IST)
కోలీవుడ్‌లో ఓ నటుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమై ఎంత కాలమైనా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే, యాగవరాయనుమ్, నాకాక్క తదితర చిత్రాల్లో సిద్ధార్థ్, స్మిరిజ దంపతులు నటించారు. వీరికి వివాహమై మూడు సంవత్సరాలు గడిచినా పిల్లలు కలుగలేదు. 
 
పిల్లల విషయంలో లోపం నీలో ఉందంటే, నీలో ఉందంటూ, ఇద్దరూ తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన భార్యను తీసుకుని హోటల్‌కు వెళ్లి భోజనం చేసి వచ్చిన సిద్ధార్థ్, ఇంటికి వచ్చిన తరువాత ఆమెతో మరోసారి గొడవపడ్డాడు. 
 
సిర్మిజ ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగా, సిద్ధార్థ్ బయట హాలులో పడుకున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటలైనా భార్య బయటకు రాకపోవడంతో తలుపులు తట్టాడు. 
 
లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో మధురవాయిల్ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి తలుపులు పగులకొట్టగా.. సిర్మిజా లోపల ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు