Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

సెల్వి

శుక్రవారం, 27 డిశెంబరు 2024 (12:38 IST)
Annamalai
Annamalai : అన్నా యూనివర్శిటీలో మూడ్రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచార ఘటనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే సర్కారును గద్దె దించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీక్ష పూనిన విషయం అందరికీ తెలిసిందే. 
 
ఈ క్రమంలోనే అన్నామలై తన మొక్కు చెల్లించుకున్నారు. ముఖ్యంగా షర్టు లేకుండా లుంగీ మాత్రమే ధరించిన ఆయన.. కొరడాతో తనను తాను ఆరు సార్లు కొట్టుకున్నారు. ఆపై రెండ్రోజుల పాటు ఉపవాస దీక్ష పాటించి రాష్ట్రంలో ఉన్న ఆరు కుమార స్వామి ఆలయాలను దర్శించుకోబోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని డీఎంకే సర్కారు వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలి పేరు బయటకు రావడానికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్‌నే కారణమంటూ  అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
అలాగే ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతిజ్ఞ చేశారు. అది మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తాము ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని.. తాను గెలిచే వరకు చెప్పులు వేసుకోనంటూ అన్నామలై వివరించారు. 

కొరడాతో కొట్టుకున్న అన్నామలై

అన్నా యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని నిరసనగా కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై

డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై నిన్న శపథం చేసిన విషయం తెలిసిందే pic.twitter.com/xl7VtKWcuq

— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు