సరిగ్గా నెల క్రితం నటి కస్తూరి రిమాండ్ ఖైదీగా కిందజైలుకు వెళ్ళింది. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకు జైలు జీవితం దక్కింది. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక తన అనుభవాలను కొన్ని మీడియా ఛానల్స్ తో తెలియజేసింది. మనం ఎలా పుట్టామో అలానే నిలబెడతారు. కూర్చొపెడతారు. చెవి, నోరు, ముక్కు, అన్ని అవయవాలను కూడా చెక్ చేసి లోపల ఏమైనా దాచిపెట్టి వుంటామోనని చెక్ చేస్తారు. ఒక రెండు దుప్పట్లు, చెంబు, పల్లెం ఇస్తారు. అంటూ పలు విషయాలు చెప్పింది.