తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఇందులో అధికార డీఎంకే సారథ్యంలోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతుంది.
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 1374 కార్పొరేషన్ వార్డులకు గాను డీఎంకే 57, అన్నాడీఎంకే 7 స్థానాలను, ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఇకపోతే డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 7, సీపీఎం 2చొప్పున గెలుచుకున్నాయి.
మున్సిపాలిటీల్లో 3843 వార్డులకు గాను డీఎంకే 248 చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకే 79, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయితీ వార్డుల్లో 1251 వార్డుల్లో డీఎంకే విజయభేరీ మోగించింది. అన్నాడీఎంకే 354 స్థానాల్లో గెలుపొందింది.