తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రానికి షాక్ ఇచ్చారు. కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన ఈ కొత్త విద్యా విధానంలో ప్రతిపాతించిన త్రిభాషా విధానం తమకు ఆమోదయోగ్యం కాదని పళని స్వామి స్పష్టం చేశారు. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...కేంద్రం తీసుకొస్తున్న కొత్త జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు.
కొత్త విద్యా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యా సంస్కరణల పేరుతో హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా తమపై రుద్దే కుట్ర జరుగుతోందని, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.