తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని, ఆమెకు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో.. ఆమె మాజీ స్నేహితురాలు శశికళ అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. అత్యవసరంగా ఏఐ డీఎంకె ఎమ్మెల్యేలంతా చెన్నైకి రావాలంటూ ఆమె ఓ ప్రకటన విడుదల జారీ చేశారు. సోమవారం వీరంతా నగరానికి రావాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.
దీనిపై మాజీ సిఎం, ప్రస్తుత ఆర్ధిక శాఖామంత్రి పన్నీర్ సెల్వం మాత్రం పెదవి విప్పడంలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఈ క్రమంలో శశికళ కాబోయే ఆపద్ధర్మ సీఎం కావచ్చునంటూ ఇంకోవైపు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు జోరందుకున్నాయి. పన్నీర్ సెల్వంకు సీఎం పదవి అప్పగించేందుకు జయమ్మ సానుకూలంగా లేరని.. అందుకే శశికళను సీఎం చేయాలని అమ్మ చెప్పేసినట్లు తెలుస్తోంది.