పొరుగింటి ఆంటీతో పారిపోయిన చిన్నకొడుకు.. తండ్రి తనయుల సూసైడ్

సోమవారం, 1 మార్చి 2021 (08:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన చిన్న కుమారుడు పక్కింటి మహిళను లేపుకెళ్లాడు. దీంతో ఇరుగుపొరుగువారి చేస్తున్న వ్యాఖ్యలతో అవమానం భరించలేక ఇంటి పెద్దతో పాటు.. అతని పెద్దకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సేలం జిల్లా, మల్లూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణి (55) అనే వ్యక్తి ఇటుక బట్టీలో కార్మికుడుగా పని చేస్తున్నాడు. ఈయనకు శంకర్‌ (25), కృష్ణన్‌ (21) అనే ఇద్దరు కుమారులు. వీరంతా నామక్కల్‌ జిల్లా ముత్తుకాపట్టిలోని ఇటుక బట్టిలో పనిచేస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో అదే ఇటుక బట్టీలో పని చేస్తున్న కొల్లంపట్టికి చెందిన భాస్కర్‌ భార్య సత్యతో చిన్న కుమారుడు కృష్ణన్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. 15 రోజుల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయంగా పోలీసులు విచారణ జరపడంతో అవమానం భరించలేక తండ్రి సుబ్రమణి, పెద్ద కుమారుడు శంకర్‌ శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు